తుపాకీతో కాల్చుకొని CRPF జవాన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మణిపూర్‌లో చోటు చేసుకుంది. జిరిబామ్ పోస్ట్ వద్ద ఉన్న యూనిట్ 20కి చెందిన ఒక CRPF జవాన్ తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రాంతంలో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.