ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. అనంతరం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవ్వనుంది. ఐపీఎల్‌లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా.. అందులో LSGదే పైచేయిగా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలుపొందింది. మరో మ్యాచ్ ఫలితం రాలేదు.