స్టార్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ వస్తున్న రూమర్స్ పై రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. 'నాకు 35 సంవత్సరాలు. నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా?' అని రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చారు. తనకు ఎంతోకాలంగా తెలిసిన, కోస్టార్ తోనే డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. కాగా, పలు చిత్రాలలో విజయ్, రష్మిక కలిసి నటించడం, సన్నిహితంగా ఉండటంతో వారు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.