100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం

75చూసినవారు
100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 100వ ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌15 రాకెట్‌ ద్వారా ఎన్వీఎస్‌-02 ఉపగ్రహాన్ని స్పేస్‌లోకి పంపనుంది. అయితే, జీఎస్‌ఎల్‌వీ-15 రాకెట్‌తో ఎన్‌వీఎస్‌ ఉపగ్రహం అనుసంధాన ప్రక్రియ పూర్తయిందని ఇస్రో ఆదివారం తెలిపింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ పోస్ట్‌లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్