‘ఛావా’ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాకు సంతోషకరమైన ప్రదేశం ఏదని అడిగితే ఇల్లు అని చెబుతాను. ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎంతో మంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ నేను ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా నా జీవితాన్ని గౌరవిస్తాను. కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులను ఇష్టపడతాను.’ అని రష్మిక అన్నారు.