మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పూణెలో హడప్సర్‌లోని ఓ స్క్రాప్ మెటల్ గోడౌన్‌లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.