తెలంగాణ సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరుగనుంది. అయితే ఈ కార్యక్రమానికి తాను రాలేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్ది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాలేకపోతున్నట్లుగా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. విగ్రహావిష్కరణకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.