పింక్ బాల్ టెస్టులో భారత్‌కు ఇన్నింగ్స్ ఓటమి భయం తప్పింది. తొలి ఇన్నింగ్స్ లోటు 157 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా 175 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (42) మరోసారి విలువైన పరుగులు చేసి భారత్‌ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించాడు. దీంతో ఆస్ట్రేలియా ఎదుట కేవలం 19 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ 337 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.