గోడకు వేలాడుతున్న మృతదేహం (వీడియో)

36498చూసినవారు
హైదరాబాద్ గాంధీనగర్ పీఎస్ పరిధి గాంధీ ఆసుపత్రి ఎదురుగా కృష్ణానగర్ లో ఉన్న సివిల్ సప్లై గోడౌన్స్ వద్ద ఎత్తయిన గోడకు ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. షర్టుతో మెడకు కట్టి ఉరేసుకున్నట్లుగా ఉండగా స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇది ఆత్మహత్యనా.. లేక హత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్