కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక

53చూసినవారు
కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక
150 పేజీల ప్రాథమిక నివేదిక (సిట్)ను కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎస్ పంపారు. ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదిక అందించింది. ఈ మేరకు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ గుర్తించారు. 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. 124 మంది అరెస్ట్ చేశారు. ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదికలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్