రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్?

28902చూసినవారు
రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్?
తెలంగాణలో రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ చేయనున్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉంటే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే అన్నీ కలిపి లెక్కించనున్నారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు కూడా మాఫీ కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్