సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవిలో పర్యటిస్తున్న ఓ యువతికి మార్గమధ్యలో ఓ జింక కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి మంచి ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. అనుకున్నట్లుగానే సెల్ఫీ కూడా తీసుకుంది. అయితే, చివరగా యువతి చేయి జింక ముందు పెట్టి థ్యాంక్స్ చెప్పాలని చూస్తుంది. దీంతో జింకకు కోపమొచ్చి ఆమె చేయిపై కొమ్ములతో కొడుతుంది. ఇక చేసేదేమీ లేక ఆ యువతి అక్కడి నుంచి పారిపోతుంది.