హైదరాబాద్ లో మూసీనది ప్రక్షాళన మొదలైంది. చాదర్ ఘాట్‌లోని మూసానగర్, రసూల్ పురా, శంకర్ నగర్ లో మూసీ రివర్‌బెడ్‌లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. నిర్వాసితులను డబుల్ బెడ్ రూం ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు.