డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌కు ప్రమాదం

64చూసినవారు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌కు ప్రమాదం
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్‌లోని ఒక పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఎస్సై చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్