ట్రంప్‌తో ఇటలీ ప్రధాని మెలోని భేటీ

68చూసినవారు
ట్రంప్‌తో ఇటలీ ప్రధాని మెలోని భేటీ
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ట్రంప్‌తో భేటీ అయ్యారు. శనివారం ఫ్లోరిడాలోని మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ అద్భుతమైన మహిళతో సమావేశం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్