బెంగళూరులో శనివారం భారీ వర్షం కురిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు, వీధులు వర్షపు నీటిలో మునిగిపోయాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనదారులు, నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం విమానాల రాకపోకలపై కూడా పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక భారీ వర్షపు నీటిలోనే వాహనాలు రాకపోకలు సాగించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి