AP: వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానాస్పద మరణాలపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. 2019 సెప్టెంబర్‌లో కాసనూరుకు చెందిన శ్రీనివాసులురెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అలాగే ఇటీవల వాచ్ మెన్ రంగన్న కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. ఈ రంగన్న మరణంతో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి కుటుంబసభ్యులను శుక్రవారం పులివెందులలో డీఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.