అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో కాల్పులు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. లాస్ క్రూసెస్‌లోని యంగ్ పార్కులో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు 19 ఏళ్ల వయసు వారు కాగా.. మరొకరి వయసు 16 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారు కూడా 16 నుంచి 36 ఏళ్లలోపు వారేనని తెలిపారు.