బీచ్‌లో కొట్టుకుపోయిన విదేశీ పర్యాటకులు.. కాపాడిన మెరైన్ సిబ్బంది (వీడియో)

85చూసినవారు
AP: విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో ఇటలీకి చెందిన విదేశీ పర్యాటకులు కొట్టుకుపోయారు. ఈ క్రమంలో అది గమనించిన మెరైన్ సిబ్బంది వెంటనే సముద్రంలోకి దిగి వారిని కాపాడారు. యారాడ బీచ్‌లో అలల ఉధృతి అధికంగా ఉంటుంది. దాంతో అది తెలియని విదేశీ పర్యాటకులు అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రమాదంలోపడ్డారు. అనంతరం తమను కాపాడిన మెరైన్ సిబ్బందికి పర్యాటకులు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్