అగ్గిపెట్టేలో శ్రీవారికి చీర సమర్పించిన భక్తుడు (వీడియో)

84చూసినవారు
TG: సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి సమర్పించారు. 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉండే చీరను దాదాపు 15 రోజుల పాటు కష్టపడి నేశారు. గతంలోనూ ఉంగరంలో పట్టే చీర, దబ్బనంలో దూరే చీరలనూ ఆయన తయారు చేశారు. తండ్రి స్ఫూర్తితో ఏటా వేములవాడ రాజన్న, శ్రీవారికి చీరలు సమర్పిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్