కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి 12వ బెటాలియన్ ఎదుట పోలీస్ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఎన్నికల హామీల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తమిళనాడు, కర్ణాటక తరహాలోనే తెలంగాణలో ఎకో పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ కుటుంబ సభ్యుల ధర్నాతో అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.