ధోని Vs పంత్.. గెలిచేదెవరో?

6830చూసినవారు
ధోని Vs పంత్.. గెలిచేదెవరో?
ఐపీఎల్‌ 14వ సీజన్‌ చివరి అంకానికి వచ్చేసింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్ కతా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆదివారం తొలి క్వాలిఫయర్‌లో టేబుల్‌ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో
చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడబోతోంది.

ఐపీఎల్‌-14వ సీజన్‌లో ఢిల్లీ నిలకడగా విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారయ్యాక చెన్నై కాస్త రిలాక్స్‌ అయింది. గత 3 మ్యాచ్‌ల్లో చెన్నై జట్టు హ్యాట్రిక్‌ ఓటములు మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలువలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి ఛాంపియన్ గా నిలవాలని చూస్తోంది. లీగ్‌ దశలో ఢిల్లీ 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిస్తే.. చెన్నై 18 పాయింట్లతో రెండో ప్లేస్‌ తో క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది.

తుది జట్లు (అంచనా)

ఢిల్లీ: పంత్‌ (కెప్టెన్‌), పృథ్వీ, ధవన్‌, శ్రేయస్‌, హెట్‌మైర్‌, స్టొయినిస్‌/రిపాల్‌, అక్షర్‌, అశ్విన్‌, రబడ, నోర్జే, అవేశ్‌.

చెన్నై: ధోనీ (కెప్టెన్‌), గైక్వాడ్‌, డుప్లెసిస్‌, అలీ, రాయుడు, ఉతప్ప/రైనా, జడేజా, బ్రావో, శార్దూల్‌, దీపక్‌, హజిల్‌వుడ్‌.

ఈరోజు ఏ జట్టు విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్