హైదరాబాద్ కుషాయిగూడ డీమార్ట్ నుండి నాగారం వరకు రోడ్డుపై డీజిల్ లీక్ అయింది. డీజిల్ కావడం వలన ఇప్పటివరకు 60 నుండి 70 మంది బైక్‌పై వెళ్తున్న వారు కింద పడ్డారు. వీరిలో ఒకరు మృతిమృతి చెందగా.. మరో మహిళ తలకు తీవ్ర గాయం అయింది. ఈసీఐఎల్ నుంచి కీసర వెళ్లే ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని పోలీసులు సూచించారు.