పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అధిక బరువు వల్ల ఆమెను ఫైనల్ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇవాళ రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. వినేశ్ ఫొగాట్ అంశంపై చర్చ చేపట్టేందుకు.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకర్ నిరాకరించారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్‌పై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు.