ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు శుక్రవారం అంతరాయం ఏర్పడింది. భారత్, ఆస్ట్రేలియా, జర్మనీ సహా ఎన్నో దేశాల్లో IT సిస్టమ్‌లలో అంతరాయం కలిగింది. ఈ కారణంగా ఆస్ట్రేలియా, అమెరికాలలో బ్యాంకులు, టెలికాంలు, మీడియా, ఎమర్జెన్సీ విమానయాన సంస్థల సేవలు దెబ్బతిన్నాయి. క్రౌడ్‌స్ట్రైక్ ఫెయిల్యూర్ వల్ల ఈ సమస్య ఏర్పడి ఉండొచ్చని మైక్రోసాఫ్ట్ విండోస్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ పేర్కొంది.