అమెరికా మాజీ అధ్యక్షుడి సోదరిపై కెన్యా లో టియర్ గ్యాస్

60చూసినవారు
అమెరికా మాజీ అధ్యక్షుడి సోదరిపై కెన్యా లో టియర్ గ్యాస్
పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా అట్టుడికింది. మంగళవారం పార్లమెంట్ కొత్త పన్నుల విధానాన్ని ఆమోదించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిరసనలో పాల్గొన్న ఔమా ఓ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆమె కళ్లు మంటలు ఎక్కడంతో విలవిలలాడిపోయారు. కళ్లు పోయాయంటూ ఆవేదన చెందారు. సహాయకులు ఆమెను అక్కడ నుంచి తీసుకునిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్