తమిళనాడు వ్యాపార వేత్త, అధికార డీఎంకే ఎంపీ ఎస్.జగత్ రక్షకన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. 'ఫెమా' నిబంధనల ఉల్లంఘన కేసులో జగత్ రక్షకన్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. గతంలో అతని ఇళ్లు, ఆఫీసుల్లో దర్యాప్తు సంస్థ సోదాలు చేసి, రూ.89 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపింది. ఈ నెల 26న వచ్చిన తీర్పు మేరకు చర్యలు చేపట్టినట్టు ఈడీ వెల్లడించింది.