డయేరియా, పొట్ట సమస్యలతో బాధపడే వారు బ్రాట్ డైట్ పాటించడం మంచిదని డైటీషియన్ గుంజన్ తెలిపారు. BRAT డైట్ అంటే బనానాస్, రైస్, యాపిల్, టోస్ట్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం. “ఈ డైట్ ను గరిష్ఠంగా 1-2 రోజుల పాటు తీసుకోవాలి. ఈ డైట్ లోని అరటిపండ్లు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేస్తాయి. రైస్.. ఇది సులభంగా జీర్ణమై, శరీరానికి శక్తినిస్తుంది. యాపిల్ లోని ఫైబర్ అదనపు నీటిని పీల్చేస్తుంది. టోస్ట్.. అనారోగ్యం వేళ శక్తిని ఇస్తుంది" అని ఆమె తెలిపారు.