జ్యోతిష్య శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ శాస్త్రం ఆతి పురాతన కాలం నుండి ప్రాచుర్యం పొందింది. శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో ప్రశ్నా శాస్త్ర సంబంధిత విషయాలు లభ్యమవుతాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రశ్నించడం అనేది వాడుకలో ఉంది. అనేక రూపాలలో ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్లున్నా జ్యోతిష్య శాస్త్ర పండితులు అతి జాగరూకతతో గణించి చెప్పే సమాధానాలు నమ్మదగినవి. ప్రశ్నా శాస్త్రానికి సమాధానం చెప్పాలంటే సాధారణంగా జాతక చక్రాన్ని చూసి చెప్పే కంటే విశేష పాండిత్యం అవసరం అవుతుంది.