పిగ్మీ హాగ్.. ప్రపంచంలోనే చిన్న పంది జాతి, పోర్కులా జాతికి చెందిన ఏకైక జాతి జంతువు. హిమాలయాల దిగువ ప్రాంతంలోని ఒండ్రు గడ్డి భూముల్లో ఉంటాయి. కేవలం ఎనిమిది అంగుళాల పొడవుతో 6.6 నుంచి 9.7 కిలోల మధ్య బరువు ఉంటాయి. ప్రసుత్తం ఈ జంతువు అంతరించిపోయే దశలో ఉంది. ఇటీవల పిగ్మీ హాగ్‌లను అస్సాంలోని మానస్ నేషనల్ పార్కులో విడుదల చేశారు.