సూర్యకాంతి భూమిని చేరే సమయం ఎంతో తెలుసా?

71చూసినవారు
సూర్యకాంతి భూమిని చేరే సమయం ఎంతో తెలుసా?
సూర్యకాంతి భూమిని చేరేందుకు 8 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుందని చెబుతారు. కానీ ఇది కచ్చితమైన సమయం కాదట. సూర్యుని చుట్టూ భూకక్ష్య సంపూర్ణ వృత్తాకారంలో కాకుండా కొద్దిగా దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. కాబట్టి భూమి, సూర్యుడికి మధ్య అసలు దూరం దాదాపు 147-152 మిలియన్ కి.మీ వరకు ఉంటుంది. అంటే సూర్యుని కిరణాలు భూమిని చేరే వాస్తవ సమయం 490 నుంచి 507 సెకన్లు లేదా 8 నిమిషాల 10 సెకన్ల నుంచి 8 నిమిషాల 27 సెకన్ల వరకు ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్