ప్రభుత్వ గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23లో భారతీయులు నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయం వెల్లడైంది. ఈసర్వే ప్రకారం.. గ్రామాల్లో ఉండే కుటుంబాలు నెలకు రూ.3,773, పట్టణాల్లో కుటుంబాలు రూ.6,459 ఖర్చు చేస్తున్నట్లు తేలింది. గ్రామాల్లో ఉండే కుటుంబాలు ఆహార పదార్థాలపై రూ.1,750, మిగతా వాటికి రూ.2,023 ఖర్చు చేస్తున్నారని, పట్టణా ప్రజలు ఫుడ్ కి రూ.2,530, మిగతావాటికి రూ.3,929 ఖర్చు చేస్తున్నారని వెల్లడైంది.