దేశంలోని పరిశుభ్రమైన నది ఏదో తెలుసా?

74చూసినవారు
దేశంలోని పరిశుభ్రమైన నది ఏదో తెలుసా?
దేశంలో గాజులా కనిపించే ఒక నది ఉంది. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని ఉమ్‌గోట్ నదిని భారతదేశంలోని పరిశుభ్రమైన నదిగా పరిగణిస్తారు. దాని మీద ప్రయాణించే పడవలు గాలిలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తాయి. ఉమ్‌గౌట్ నదిని డౌకి అని కూడా అంటారు. డౌకి భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక చిన్న పట్టణం. ఇక్కడ నివసించే గిరిజన వర్గాల పూర్వీకుల నుంచి వస్తున్నసంప్రదాయాలే ఈ పరిశుభ్రతకు కారణమని చెబుతున్నారు. దీనిని వివిధ సంఘాలకు చెందిన పెద్దలు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్