ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది వస్తోన్న అతిపెద్ద ఐపీఓగా ఈ పబ్లిక్ ఇష్యూ మార్కెట్‌లోకి రాబోతోంది. ఇక ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 2న ప్రారంభమై ఆగస్టు 6న ముగియనుంది. ఒక్కో లాట్ సైజ్ 195 ఈక్విటీ షేర్లు. అంటే ఒక్క లాట్ కోసం 14,820 రూపాయలు చెల్లించాలి. ఆగస్టు 7న షేర్ల కేటాయింపు జరగనుంది. ఆగస్టు 13న షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావొచ్చని అంచనా.