సముద్రంలో ఒళ్లంతా ముళ్లున్న స్టార్‌ఫిష్‌లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల వీటిని 'క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్‌ఫిష్' అని అంటారు. సముద్రం లోలోతుల్లో పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతికే ఈ ముళ్ల స్టార్‌ఫిష్‌లు.. నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు ఇలా రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇక పర్యావరణ మార్పులు, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటీకి తగ్గిపోతుండటంతో వీటి సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది.