బాంబ్ సైక్లోన్ అనే పదం బాంబోజెనిసిస్ నుంచి వచ్చింది. బాంబ్ సైక్లోన్ అనే పదాన్ని 1980ల్లో వాతావరణ శాస్త్రవేత్తలు తీసుకువచ్చారు. గంటల వ్యవధిలోనే తుపాను బలపడే పరిణామాన్ని బాంబ్ సైక్లోన్‌గా పిలుస్తారు. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో కనీసం 24 మిల్లీబార్లు అంతకంటే ఎక్కువ మేర వాతావరణ పీడనం పడిపోవడాన్ని ఈ తరహా తుపానుగా పరిగణిస్తారు. హరికేన్ స్థాయిలో గాలులు వీయడంతోపాటు భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది.