కేసీఆర్ సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బిఎ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఎ (తెలుగు సాహిత్యం) చదివారు. అయితే అదే విశ్వవిద్యాలయ శత వసంతాల వేడుకలను పూర్వ విద్యార్థి అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించడం విశేషం.