TG: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోహిర్ మండలంలో సిద్దాపూర్ తాండ సమీపంలో ఆదివారం రాత్రి అతివేగంగా వెళుతున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న రాథోడ్ శంకర్ (25), రాథోడ్ పవన్ (26) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.