TDP తరపున 1983లో తొలిసారిగా సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి KCR ఓడిపోయారు. ఆ తర్వాత 1989, 1994, 1999, 2001, 2004లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారిగా 1987-88లో మంత్రి అయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఏప్రిల్ 27న TRSని స్థాపించారు. తెలంగాణ సాధించాక తొలి సీఎంగా వరుసగా పదేళ్లు పని చేశారు.