ఒకే అంతరిక్ష యాత్రలో అత్యధిక రోజులు స్పేస్‌లో గడిపిన వ్యక్తిగా దివంగత రష్యన్ వ్యోమగామి వాలెరి పాలియాకోవ్ రికార్డు సృష్టించారు. ఆయన 1994-95లో 437 రోజులు అంతరిక్షంలో గడిపారు. తన ప్రయాణంలో 7,075 సార్లు భూమిని చుట్టి.. 30,07,65,472 కి.మీ.లకు పైగా ప్రయాణించి 22 మార్చి 1995న సురక్షితంగా దిగారు. 286 రోజుల అంతరిక్షయాత్ర తర్వాత సునీతా విలియమ్స్ భూమిపైకి బుధవారం తిరిగిరానున్నారు.