పారా అథ్లెట్ దీప్తి ఎవరో తెలుసా ?

53చూసినవారు
పారా అథ్లెట్ దీప్తి ఎవరో తెలుసా ?
TG: పారిస్‌ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి అర్జున అవార్డు వ‌రించింది. 32 మంది క్రీడాకారులకు కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించగా ఇందులో తెలంగాణ నుంచి దీప్తి ఉన్నారు. వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి చిన్నతనం నుంచే మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డారు. కోచ్ రమేశ్ ఆమెలోని టాలెంట్‌ను గుర్తించి హైదరాబాద్ తీసుకొచ్చి శిక్షణ ఇప్పించడంతో ప్రపంచ వేదికల్లో సత్తా చాటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్