మనకు మనం కితకితలు పెట్టుకుంటే రాని నవ్వు ఇతరులు పెట్టినప్పుడు వస్తుంది. దీనికి కారణం ఉందని నిపు
ణులు చెబుతున్నారు. ఎవరైనా మనకు కితకితలు పెట్టినప్పుడు నవ్వు రావడానికి మెదడులోని కార్టిక్స్, ఎంటీరియర్ సింగులేట్ కార్టిక్స్ భాగాలు కారణం. ఇతరులు మనకు కితకితలు
పెడితే మెదడులోని సెరిబెల్లమ్‌కు సంకేతాలు అందుతాయి. అక్కడి నుంచి కార్టిక్స్‌కు సమాచారం అందుతుంది. అవి యాక్టివ్ కాగానే మనకు నవ్వు పుడుతుంది.