కూరగాయలు సాగు చేపట్టే రైతులకు కాలీఫ్లవర్ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇది సాధారణంగా చల్లని, కొద్దిగా తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతుంది. అలాగే క్యాలీఫ్లవర్ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతల వారిగా వేసుకోవడం మంచిది. ఇక దీని సాగుకు విశాలమైన నేలలు, లోతైన లోమీ నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల పీహెచ్ విలువ 5.0 నుంచి 6.0 వరకు ఉండాలి. కాలీఫ్లవర్ మొక్కల పెరుగుదలకు నీటి పారుదల చాలా ముఖ్యం.