తనకు మద్యం ఇవ్వలేదని ఓ మహిళ విమానంలో నానా రచ్చ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఆఫ్రికాలోని డర్బన్ నుంచి కేప్‌టౌన్ వెళ్లే విమానంలో మద్యం మత్తులో ఉన్న మహిళ.. విమాన సిబ్బందితో గొడవకు దిగింది. తనకు ఇంకా మద్యం కావాలని డిమాండ్ చేసింది. అయితే, విమాన సిబ్బంది మాత్రం ఇప్పటికే తాగినందున ఇంకా మద్యం ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో ఆ మహిళ వారిపై దుర్భాషలాడుతూ దాడికి దిగింది.