కస్టమర్లను చేర్చుకోవద్దు, క్రెడిట్‌ కార్డ్స్‌ ఇవ్వొద్దు: RBI

65చూసినవారు
కస్టమర్లను చేర్చుకోవద్దు, క్రెడిట్‌ కార్డ్స్‌ ఇవ్వొద్దు: RBI
భారతీయ బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ RBI , కోటక్ బ్యాంక్‌పై భారీ యాక్షన్‌ తీసుకుంది. ఆన్‌లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా నిషేధం విధించింది. అంతేకాదు, కోటక్ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లందరికీ అన్ని సేవలను కోటక్ బ్యాంక్‌ కొనసాగించొచ్చని కేంద్ర బ్యాంక్‌ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్