అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. 78 ఏళ్ల ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.