ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఓ మహిళ ఏకంగా రూ.కోటి విరాళంగా అందించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి.విజయలక్ష్మి సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. తమ తల్లి ఇందిరాదేవి పేరిట, ఆమె కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో తమకున్న స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్టు విజయలక్ష్మి చెప్పారు. కోగంటి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా ఉన్నారు.