AP: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని లక్ష్మీనగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుమారుడు ఎల్ల కృష్ణ 5 రోజులుగా స్కూల్‌కు వెళ్లక పోవడంతో తండ్రి శేఖర్ అతడిని మందలించాడు. తండ్రి మందలించాడని మనస్తపానికి గురైన ఎల్ల కృష్ణ(10) పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎల్ల కృష్ణ మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి.