అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ఈ వేడుకలో ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సినీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.