అయ్యప్పస్వాముల బస్సులో మంటలు (వీడియో)

71చూసినవారు
అయ్యప్పస్వాములు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటన తమిళనాడులోని పెరంబలూర్‌లో జరిగింది. ఏపీలోని విజయనగరం జిల్లా రేగిడి మండలం మజ్జిరాముడుపేటకు చెందిన 50 మంది అయ్యప్పస్వాములు బస్సులో శబరిమల బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన స్వాములు బయటకు దిగి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, లగేజీ, దుస్తులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్